![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -302 లో.. అప్పుకి పెళ్లి చెయ్యాలని కనకం కృష్ణమూర్తి అనుకుంటారు. అలా అనుకొని పెళ్లి సంబంధం చూడటం కోసం పెళ్ళిల్ల పేరయ్యకి కబురు పంపిస్తారు. కాసేపటికి అబ్బాయిల ఫోటోలు పట్టుకొని అతను వచ్చి కనకం-కృష్ణమూర్తిలకి చూపిస్తాడు. అబ్బాయికి ఆస్తులు లేకున్నా పర్లేదు కానీ మా అప్పుని బాగా చూసుకోవాలని కనకం అంటుంది. ఇదంతా జరుగుతున్నప్పుడే అక్కడికి అప్పు వస్తుంది. ఈ అబ్బాయి ఎలా ఉన్నాడని అనగానే అప్పు కోపంగా సంబంధాలు తీసుకొని వచ్చిన పేరయ్యని కొట్టలని అనుకుంటుంది. దాంతో వాడు పరుగెత్తుతాడు. ఒకరిని ప్రేమించి వాడికి పెళ్లి అవగానే మర్చిపోయి వేరేవాళ్ళని చేసుకోమంటే ఎలా అంటూ అప్పు అనేసి కోపంగా లోపలికి వెళ్తుంది. అసలే బాధలో ఉంది.. ఇంకా బాధ పెడుతున్నామేమోనని కృష్ణమూర్తి అంటాడు.
అ తర్వాత అప్పు ఇలా బాధ పడుతుంటే చూడలేకపోతున్న తన మనసు మార్చాలని కనకం అనుకుంటుంది. మరొకవైపు పూజకి కావ్య అంతా సిద్ధం చేస్తుంది. అప్పుడే రుద్రాణి వచ్చి అక్కడ ఉన్న ఓ దీపం పడేస్తుంది. అది పడేసింది కావ్య అని క్రియేట్ చేసి తనపై రుద్రాణి అరుస్తుంటే.. ఇంట్లో అందరు వస్తారు. నీకు నా కొడుకు, కోడలు పూజ చెయ్యడం ఇష్టం లేదు అందుకే ఇలా చేశావంటు ధాన్యలక్ష్మి తిడుతుంది. అపర్ణ కూడా కావ్యనే అంటుంటే.. సుభాష్ మధ్యలో కలుగుజేసుకొని మీ అందరి కంటే ముందుగా లేచి అవ్వన్నీ సిద్ధం చేస్తే ఇలా అంటారా? ఏదో పొరపాటు జరిగిందని సైలెంట్ గా ఉండలేరా అంటూ అపర్ణ, ధాన్యలక్ష్మిలపై కోప్పడతాడు. వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటారు.. ధాన్యలక్ష్మి కావ్యపై ఉన్న కోపాన్ని చూపించాలి. అపర్ణకేమో తన పెద్దరికం చూపించాలని ఇందిరాదేవి అంటుంది. ఇక్కడ పూజ చేస్తుంది మూడు జంటలు. రాజ్ రాహుల్ ల పెళ్లి అప్పుడు పూజ చెయ్యలేదు. ఇప్పుడు మూడు జంటలు పూజ చెయ్యాలి. కావ్య, స్వప్న మీరు రెడీ అయి రండి అని ఇందిరాదేవి అంటుంది.
మరొకవైపు అప్పు తిరిగి పిజ్జా డెలివరీ జాబ్ లో జాయిన్ అవ్వాలని వెళ్తుంది. ఇక ఆ స్టోర్ ఓనర్ జాబ్ చేయడం వద్దని చెప్పడంతో అప్పు డిస్సపాయింట్ అవుతుంది.. మరొకవైపు కావ్య స్వప్నలతో పాటు కలిసి పూజ చెయ్యడం నాకు ఇష్టం లేదని ధాన్యలక్ష్మికి అనామిక చెప్తుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి వెళ్లి అపర్ణ ఇందిరదేవిలకి వాళ్ళతో కలిసి పూజ చెయ్యడం అనామికకి ఇష్టం లేదట అని అనగానే.. నువ్వు నీ కోడలికి సర్ది చెప్పు ఇలా కోడళ్ళ మాటల వల్లే కుటుంబం విడిపోతుంది. కావ్యపై నీ కోడలి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చెయ్ అని ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి చెప్తుంది. ఆ మాటలు అనామిక వింటుంది. మరొకవైపు స్వప్న రెడీ అవుతు రుద్రాణిని పిలిచి చీర సెట్ చెయ్ అనగానే.. రుద్రాణి ఆశ్చర్యంగా చూస్తుంది. తరువాయి భాగంలో అప్పుకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ విషయం కావ్యకి కనకం ఫోన్ చేసి చెప్తుంది. పూజ జరిపించండి నేను వెనకాల డోర్ నుండి వెళ్తున్నానని వెళ్తుంది. కావ్య బయటకు వెళ్ళిందని రాజ్ చెప్పగానే.. రాజ్, కావ్య ఇద్దరు పూజ చేయాలని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |